Breaking News India Technology

Andhra Pradesh Public Service Commission’s Job Notification

Andhra Pradesh Public Service Commission Issued a Fresh Job Schedule. Here comes the Message in Telugu

గ్రూప్‌-1 సర్వీసెస్‌ (నోటిఫికేషన్‌ నెం.27/2018) మెయిన్స్‌ పరీక్షలు 2020 ఫిబ్రవరి 4 నుంచి 1f6వ తేదీ వరకు జరగనున్నాయి.

ఏడు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 4న తెలుగులో పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌), 5న ఇంగ్లీషులో పేపర్‌(క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌), 7న పేపర్‌-1, 10న పేపర్‌-2, 12న పేపర్‌-3, 14న పేపర్‌-4, 16న పేపర్‌-5 పరీక్షలు జరుగుతాయి.

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌(నో. నెం.10/2018) మెయిన్స్‌ పరీక్షలు మార్చి 17 నుంచి 19వ తేదీ వరకు ఐదు సెషన్లలో జరుగుతాయి.

డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(నో.నెం.20/2018) మెయిన్స్‌ పరీక్షలు మార్చి 19, 20 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహిస్తారు.

పరిపాలనా పరమైన కారణాల వల్ల పరీక్షల షెడ్యూల్‌ను ఈ మేరకు మార్పులు చేసినట్లు ఏపీపీఎస్సీ సెక్రెటరీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌(నో.నెం.16/2018) పోస్టులకు ప్రొవిజినల్‌గా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ నోటీసు బోర్డుతో పాటు https://psc.ap.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.